BRS Party: బీఆర్‌ఎస్ అకౌంట్లలో అన్ని వేల కోట్లా!

బీఆర్‌ఎస్ పార్టీ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ధనికమైనదని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రకారం.. బీఆర్ఎస్ అకౌంట్లో రూ. 1449 కోట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించిన ఆడిట్ వెల్లడించింది.

New Update
BRS Party: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి

దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్ పార్టీ రిచ్చెస్ట్ అని తాజాగా ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్‌కి ఆడిట్ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం బీఆర్ఎస్ అకౌంట్లో ఏకంగా రూ. 1449కోట్లు ఉన్నట్లు తెలిపింది.

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

బీఆర్‌ఎస్ పార్టీనే రిచ్చెస్ట్ అని ఎలక్షన్ కమిషన్..

బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రూ. 120 కోట్లు ఖర్చు చేయగా.. 17 ఎంపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 95 లక్షల చెక్కులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒడిశాకి చెందిన బిజూ జనతాదళ్ పార్టీ రూ.625 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. కానీ ఇప్పడు బీఆర్‌ఎస్ పార్టీ మొదటి స్థానంలో ఉందని ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించిన నివేదికలో తేలింది. 

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

ఇదిలా ఉండగా.. టీడీపీ అకౌంట్‌లో రూ. 272 కోట్లు ఉండగా, వైసీపీ అకౌంట్‌లో రూ. 29 కోట్లు, డీఎంకే అకౌంట్‌లో రూ. 338 కోట్లు, సమాజ్‌వాదీ అకౌంట్‌లో రూ. 340 కోట్లు ఉన్నట్లు పార్టీల ఆడిట్ రిపోర్ట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.  

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

బీఆర్‌ఎస్ పార్టీ వివిధ రకాల ప్రచారానికి కూడా ఖర్చు పెట్టింది. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారానికి రూ.10.51 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ప్రచార సామాగ్రికి రూ.34.68 కోట్లు, బహిరంగసభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు ఖర్చు చేయగా.. ఇతర ప్రచారానికి రూ.34.39 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదిక తెలిపింది.  

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు