వారిని పక్కాగా ఊచలు లెక్కబెట్టిస్తా.. వరంగల్ లో రేవంత్ సంచలన స్పీచ్-LIVE

అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్న వారిని ఊచలు లెక్కబెట్టిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. వరంగల్ లో ఈ రోజు జరిగిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించాలన్నారు.

New Update

హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014-18 వరకు ఒక్క మహిళా మంత్రి కూడా లేరని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టడానికి పదేళ్లైనా కేసీఆర్ కు చేతులు రాలేదని విమర్శించారు. ఎంతో పట్టుదలతో తాము ఈ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు.

Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!

వరంగల్ ను అభివృద్ధి చేస్తాం..

వరంగల్ ను హైదరాబాద్ కు పోటీ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెడతారన్నారు. అక్రమ సంపాదనతో కిరాయి మనుషలను తెచ్చి కుట్రలు చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో మీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్పా.. తెలంగాణ సమాజానికి ఏం కాలేదన్నారు. 

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

కేసీఆర్ ఉద్యోగం ఊడితే 50 వేల మందికి ఉద్యోగాలు..

కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే పది నెలల్లో 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కేసీఆర్ ఓటమితో 23 లక్షల రైతుల కుటుంబాలకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలతో మాఫీ కాని వారికి కూడా త్వరలోనే చేస్తామన్నారు. రైతులందరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు. మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. 

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

అధికారంలో ఉంటే దోచుకుంటా.. ఓడిపోతే ఫామ్ హౌజ్ లో పండుకుంటా.. ఇదే కేసీఆర్ వైఖరి అన్నారు. మోదీకి గులాం గిరి చేస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోని కిషన్ రెడ్డికి ఈ రాష్ట్రంలోనే ఉండే హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఈ రోజు ఏం మాట్లాడితే.. కిషన్ రెడ్డి రేపు అది మాట్లాడుతారన్నారు.

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు