శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తర్వాత భూ మోసాలు పోయాయని అన్నారు. ప్రజలు వెంటపడి మరి ధరణిని తిరిగి సాధించుకుంటారని తెలిపారు.'' తెలంగాణ రైతులకు రక్షణ కవచం ధరణి. ఇది వచ్చాక భూమోసాలు పోయాయి. ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదు. భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది. ధరణిలో కుట్రకోణం ఉందని ప్రభుత్వం చెప్పడం దారుణం. తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి. 17.8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20-25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితి ఉండేది. కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ రైతుకు మాత్రమే భూమికి యాజమన్య హక్కు ఉండే విధంగా చేశారు. ధరణి వల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. దాదాపు 35749 ఉద్యోగులు 100 రోజుల్లో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారు. ఆ తర్వాత భూవివరాలను ధరణిలో ఎక్కించారు. Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను కాపాడింది. ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురికాలేదు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేది. భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. భూ రికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయి, రాష్ట్ర సంపద పెరిగింది. దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అందించింది. గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావు. ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి అయ్యారు. మరోసారి 32 కాలమ్‌లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది. రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది. Also Read: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ హైదరాబాద్ చుట్టున్న భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోంది. భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలి. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలని'' కవిత అన్నారు.