నవీన్ యాదవ్‌ను కలిసిన BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తలసారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురినే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు.

New Update
BRS MLA Talasani Srinivas Yadav

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిశారు. తలసారి శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కూతురినే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నవీన్ యాదవ్‌కు వరసకు మామ అవుతాడు. ఇరువురు వేరువేరు పార్టీల్లో ఉన్నా.. ఫ్యామిలీ పరంగా ఒక్కటే. దీంతో  ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

సోమవారం నవీన్ యాదవ్ పుట్టిన రోజు, అలాగే నవంబర్ 14న వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కావున తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మామా అల్లుళ్లు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Advertisment
తాజా కథనాలు