Hussain Sagar Danger Bells: నగరాన్ని భయపెడుతున్న హుస్సేన్‌సాగర్
కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్ మహానగరంలో కూడా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. అటు, జంట జలాశయాలతో పాటుగా హుస్సేన్ సాగర్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ టీం పనిచేస్తోందని ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.