/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-7.jpg)
MLA KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. చీకటి రోజులను తెచ్చిందని చురకలు అంటించారు. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఆయన ఎక్స్ లో.. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోందని.. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందని అన్నారు.
Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
రేవంత్ పాలనలో ఇన్ని ఘోరాల..?
కేటీఆర్ ఎక్స్ లో.. " మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది.
కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు.. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు..
పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన.. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం.. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా.. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం.. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర.. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి.. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు" అని విమర్శలు గుప్పించారు.
Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది
— KTR (@KTRBRS) November 12, 2024
కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది
మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది
పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది
కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb
Also Read: Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు
Also Read: Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!