/rtv/media/media_files/2024/11/13/wIJkcALOpWrknHtcKf5S.jpg)
MLA KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. ఎదో ఒక కేసులో తనను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని తనకు ముందే తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రైతుల కోసం తాను జైలు వెళ్ళడానికి సిద్ధమని చెప్పారు. రైతులకు అండగా ఉన్న తనను జైలు పంపడం గర్వాంగా ఉందని పేర్కొన్నారు. రేవంత్ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరని.. కావాలంటే అరెస్ట్ చేసుకొమ్మని రేవంత్ కు సవాల్ విసిరారు.
Also Read: T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ
ఎవనిదిరా కుట్ర?....
కేటీఆర్ ట్విట్టర్ లో.. " ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?.. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?... నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?, గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?, నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?, పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!
మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?, 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?, నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!, నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!, చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!." అని నిప్పులు చెరిగారు.
Also Read: Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్!
ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?
— KTR (@KTRBRS) November 14, 2024
నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?
నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?
నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి,…
Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ!
Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!