ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ధర్మాసనం డిసెంబర్ 27కి వాయిదా వేసింది. కేటీఆర్‌ను డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అయితే తాజాగా వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారని.. వారికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
Also Read: గేదెకు DNA టెస్ట్ చేయించిన పోలీసులు.. రెండు గ్రామాల గొడవతో!
'' ఇది ఒక డొల్ల కేసు అని మొదటి అడుగులోనే తేలిపోయింది. సీఎం రేవంత్ ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడారు. దీనిపై చర్చించాలని కోరితే బీఆర్ఎస్ సభ్యులను బయటికి పంపించి చర్చించారు. ఫార్ములా-ఈ రేస్‌కు మూడో విడత కింద 50 శాతం నిధులు (రూ.45 కోట్లు) చెల్లించకపోవడం వల్ల ఒప్పందం రద్దు చేసుకున్నామని ఏవీవీ సంస్థ డిసెంబర్ 22న దాన కిశోర్‌కు లేఖ రాసింది.
నిధుల చెల్లింపు విషయంలో ఇర్రెగ్యులారిటీ ఉంది కానీ.. ఇల్లీగల్ మాత్రం లేదు. రేసింగ్ నిర్వహించిన సంస్థకు HMDA నుంచి చెల్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహించేందుకు మొత్తం 192 దేశాలు పోటీపడ్డాయి. రేసింగ్ కోసం మొదటి దశలో రూ.30 కోట్లు ఖర్చయ్యింది. దీంతో జీఎస్‌టీ రూపంలో రాష్ట్రానికి రూ.71 కోట్ల లాభం వచ్చింది. మూడో దశలో రూ.45 కోట్లు చెల్లించి ఉంటే రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం వచ్చేది.
Also Read: ఆ రంగంలో 5 కోట్ల జాబ్స్.. కేంద్ర మంత్రి అదిరిపోయే శుభవార్త!
ఈ-కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా-4 నిర్వహించి రూ.140 కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు సర్కార్ రూ.120 కోట్లు ఖర్చు చేసి ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ నిర్వహించింది. గత ప్రభుత్వం చేసిన పనులు కొనసాగొద్దని.. సభలో కేటీఆర్ నిలదీయకుండా ఉండేందుకే అలా అక్రమ కేసులు పెడుతున్నారు. ఏడాది పాలన వైఫల్యంపై ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నారని'' హరీశ్ రావు అన్నారు.