Karnataka: ఒక గేదె కోసం రెండు గ్రామాల ప్రజలు గొడవపడిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దేవనగెరె జిల్లాలోని కునిబెలకెరె, అనే గ్రామ ప్రజలు తాము పవిత్రంగా పూజించే, దేవాలయానికి అంకితం చేయబడిన గేదే తప్పిపోవడంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి శివమొగ్గ గోశాలలో గేదెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గేదె మాదంటే మాదంటూ కునిబెలకెరె, కులగత్తె గ్రామస్థులు గొడవకు దిగారు. ఈ క్రమంలో గేదె అసలు యజమాని ఎవరో తెలుసుకునేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. ఏడుగురిపై కేసు నమోదు.. ఇక పోలీసుల విచారణలో గేదె వయసు ఎనిమిదేళ్లని కునిబెలకెరె గ్రామస్తులు చెప్పగా.. కాదు మూడేళ్లేనని కులగత్తే గ్రామస్తులు చెప్పారు. దీంతో గేదెకు పరీక్ష నిర్వహించగా అది ఆరేళ్లకు పైబడి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో కులగత్తే గ్రామానికి చెందిన ఏడుగురిని దోషులుగా పేర్కొంటూ చోరీ కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే సమస్యను పరిష్కరించామని జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంతోష్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్.. అప్పటివరకు నో అరెస్ట్! గతంలోనూ ఇదే తరహా గొడవ.. ఇదిలా ఉంటే.. కర్నాటకలోని ఈ గ్రామాలు గేదెల కోసం పోరాడడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కునిబెలకెరె గ్రామంలోని ప్రధాన దేవత అయిన కరియమ్మ దేవికి ఒక గేదెను సమర్పించారు. అయితే బేలకెరే సమీపంలోని కులగత్తే గ్రామస్థులు తమకు తప్పిపోయిన గేదె దొరికిందని, ఆ గేదెకు తామే యజమానులమని చెప్పి బంధించారు. రెండు నెలలుగా అది కనిపించకుండా పోయేసరికి కునిబెలకెరె గ్రామస్తుల్లో ఒకరైన మాదప్ప రంగన్నవర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడుకూడా ఇరువర్గాల వాదనలు విని, రుజువులు చూపించిన తర్వాత గేదె పంచాయితీ క్లియర్ చేశారు పోలీసులు.