Jobs: ఆ రంగంలో 5 కోట్ల జాబ్స్.. కేంద్ర మంత్రి అదిరిపోయే శుభవార్త!

వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2030 నాటికి ఈ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని, రూ.20 లక్షల కోట్ల స్థాయికి మార్కెట్ విలువ పెరుగుతుందని వెల్లడించారు.

New Update
EV JOB

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఐదేళ్లలో ఈవీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2030 నాటికి ఈ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని, రూ.20 లక్షల కోట్ల స్థాయికి మార్కెట్ విలువ పెరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రారంభ దశలోనే ఉన్నాయని చెప్పారు.   

Also Read: భారతీయులు ఆ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: మోహన్ భగవత్

మొత్తం వాహనాల అమ్మకాల్లో ఈవీ రంగం వాటా 10 శాతం కన్నా తక్కువగానే ఉంది. 2024లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 18 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. అయితే 2030 నాటికి పరిస్థితి మారుతుందని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈవీ రంగంలో మార్కెట్‌ విలువ రూ.4.50 లక్షల కోట్లుగా ఉందని.. 2030 నాటికి ఇది రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌కు చేరుకుంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రిక్ హబ్‌గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈవీల ఫైనాన్స్‌ మర్కెట్ కూడా రూ.4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని తెలిపారు.  

దేశంలో రవాణా రంగం నుంచి 40 శాతం వాయు కాలుష్యం జరుగుతోందని.. శిలాల ఇంధనాల దిగుమతులు కూడా రూ.22 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఇది ఆర్థికంగా సవాలుగా మారిందని.. అందుకే కేంద్రం హరిత ఇంధనంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని తెలిపారు. మొత్తం విద్యుత్‌లో 44 శాతం సౌర విద్యుత్‌ ఉండేలా ప్లాన్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. సౌర విద్యుత్‌తో పాటు జల విద్యుత్, హరిత విద్యుత్‌ అభివృద్ధికి కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.  

Also Read: ఘోర విషాదం.. పెళ్లి బస్సు బోల్తా.. 5గురు స్పాట్‌ డెడ్!

మనదేశానికి లక్ష విద్యుత్ బస్సులు అవసరం ఉండగా.. ఇప్పుడు కేవలం 50 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే విద్యుత్‌ వాహన తయారీ సంస్థల క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు 2014లో భారత వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు. జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే మూడో స్థానంలోకి చేరామని వెల్లడించారు.   

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు