/rtv/media/media_files/2025/01/15/mPsCSVewXbME18M3vaxR.jpg)
Padamati Anantha Reddy
Mutton free: కనుమ పండుగ సందర్భంగా గుంతపల్లి గ్రామానికి బీఆర్ఎస్ నేత అనంతరెడ్డి తన గ్రామ ప్రజలకు ఉచితంగా మటన్ పంచిపెట్టారు. 440 కుటుంబాల్లో 400 ఇళ్లకు కొత్త టిఫిన్ బాక్స్‌లలో మాంసం పంపిణీ చేశారు. మిగతా 40 ఫ్యామిలీలకు నిత్యావసర సరుకులు అందించారు. వీడియో వైరల్ అవుతోంది.
కొవిడ్ సమయంలో సేవలు..
ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల గుంతపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత పడమటి అనంతరెడ్డి తమ గ్రామ ప్రజలకోసం భారీగా ఖర్చు చేశారు. టిఫిన్ బాక్స్‌లలో అరకిలోకుపైగా మాంసం ఉంచి పంపిణీ చేశారు. గ్రామంలో ఏ పనిలోనైనా యాక్టివ్ గా ఉండే అనంతరెడ్డి.. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో ఇలాగే తన గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. అంతేకాదు వైద్య సహాయం కూడా చేస్తుంటారు. ప్రస్తుతం మటన్ పంచిన వీడియోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు అనంతరెడ్డిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు ఇది ఎన్నికల స్టంట్ అని, మరికొన్ని రోజుల్లో సర్పంచ్ ఎన్నికల రానున్న నేపథ్యంలో అప్పుడే కార్యక్రామాలు మొదలుపెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి