/rtv/media/media_files/2026/02/13/harish-rao-2026-02-13-15-16-36.jpg)
Medak Municipality Won BRS Seats
మెదక్ మున్సిపల్(medak municipality) ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పట్టు సాధించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గాను బీఆర్ఎస్ 15 వార్డులలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తూ 14 వార్డులలో గెలుపొందింది. బీజేపీ, బీఎస్పీ చెరో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కేవలం ఒకే ఒక్క వార్డు వ్యత్యాసం ఉండటంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(mynampally rohit), మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు(mla mynampally hanumantha rao) తీవ్రంగా ప్రచారం చేశారు. అయినప్పటికి మాజీ మంత్రి హరీష్ రావు తన జోరు కొనసాగించారు.
Also Read : మహబూబాబాద్ జిల్లాలో హంగ్.. చైర్మన్ పీఠం కోసం BRS మాస్టర్ స్కెచ్!
Also Read : నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..
Follow Us