CM Revanth: ఆమె సేవలు అపారమైనవి.. బి.విజయభారతికి సీఎం ప్రగాఢ సానుభూతి!
ప్రముఖ రచయిత్రి, బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానూభూతి తెలిపారు. సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా విజయభారతికి నివాళి అర్పించారు. అనారోగ్యంతో విజయభారతి శనివారం చనిపోయారు.