Jubilee Hills : అసలు నేను లిస్టులోనే లేను.. బొంతు రామ్మోహన్‌ హాట్‌ కామెంట్స్‌

జూబ్లీహిల్స్‌ టికెట్‌పై కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి లిస్టులో తాను లేను అని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎవరిని అడగలేదన్నారు రామ్మోహన్

New Update
congres

జూబ్లీహిల్స్‌ టికెట్‌పై కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి లిస్టులో తాను లేను అని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎవరిని అడగలేదన్నారు రామ్మోహన్.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అభ్యర్థిని హైకమాండ్‌ నిర్ణయిస్తుందని..  టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను కాంగ్రెస్‌ గెలుపు కోసం పనిచేస్తానని అన్నారు. PCC షార్ట్‌లిస్టులో నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, CN రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో ఒకరి పేరును ఏఐసీసీ అధికారింగా ప్రకటించనుంది. అయితే నవీన్ యాదవ్‌కే టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐసీసీ ఎవరకి టికెట్ ఇస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

Also Read: Flipkart Mobile Offers: రచ్చ రంబోలా.. Samsung ఫోన్‌పై రూ.13వేల భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్‌ అదిరింది..!

మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా

ఈ ఉప ఎన్నిక BRS సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలైన BRS, BJP మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను BRS అభ్యర్థిగా ప్రకటించింది. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల తర్వాత నగరంలో తమ ప్రాబల్యాన్ని తిరిగి నిరూపించుకోవాలని చూస్తోంది. 

Also Read:  Snake wife: రాత్రికి రాత్రి పాములా మారిపోతున్న భార్య.. గజగజ వణికిపోతున్న భర్త

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్, సంక్షేమ పథకాలపై నమ్మకంతో ఈ కీలకమైన అర్బన్ సీటులో తమ ఖాతా తెరవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థిని షార్ట్‌లిస్ట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నిక ఫలితం త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని ప్రధాన పార్టీలు దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నికకు నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్ 6 నుండే హైదరాబాద్ జిల్లాలో అమల్లోకి వచ్చింది.అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు వేయవచ్చు.  

Also Read : Bigg Boss Telugu: బిగ్ ట్విస్ట్! అందరూ డేంజర్ జోన్లో .. ఏడుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు!

Advertisment
తాజా కథనాలు