/rtv/media/media_files/2025/06/30/bonalu-festival-celebrated-with-grandeur-in-dubai-2025-06-30-21-02-24.jpg)
Bonalu festival celebrated with grandeur in Dubai
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న (జూన్ 29) ఆదివారం ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం (ETCA) ఆధ్వర్యంలో ప్రజలు బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికతకు, భక్తి భావనకు ప్రతీక అయిన తెలంగాణ బోనాల పండుగను మైత్రి ఫార్మ్స్, అజ్మాన్‌లో భక్తి శ్రద్దలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ETCA ఆధ్వర్యంలో ఇది మూడవ బోనాల వేడుకగా జరగడం విశేషం.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
దుబాయ్‌లో బోనాల పండుగ
ఈ పండుగ కార్యక్రమం గౌరమ్మ పూజతో ప్రారంభమైంది. ఇందులో అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా దీపప్రజ్వలన చేసి, నైవేద్యాలు సమర్పించారు. పట్టు చీరల్లో బోనాల ఊరేగింపులో మహిళలు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆకర్షణీయంగా నిలిచాయి.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
500 మంది హాజరు
ఇందులో భాగంగా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దాంతోపాటు ఒడి బియ్యం సమర్పణ, అమ్మవారికి హారతి, మహిళలందరికీ వాయునం పంచడం విశిష్టంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరై తమ సాంస్కృతిక పరంపరను సామూహికంగా గౌరవించారు. మహిళలు బోనాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని, బోనాల్ని సమర్పించి ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ఆకర్షణలు:
ఈ వేడుకలో అమ్మవారి మండపం, అలంకరణ భక్తి పారవశ్యంలో మునిగేలా చేసాయి. మహిళలు బోనాలు ఎత్తుకొని కుటుంబాలతో ఊరేగింపులో పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. ఒగ్గు కథా బృందం ప్రదర్శించిన వినూత్న డప్పు విన్యాసాలు, నృత్యాలు అందరిని అలరించాయి.
పోతరాజుల వేషధారణలు, ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత ఉత్తేజాన్ని నింపాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ వంటలతో హాజరయిన వారి కోసం నిర్వాహకులు ఏర్పాటు చేసిన భోజనాలు తెలంగాణ ఊరులో జరిగిన వాతావరణాన్ని గుర్తు చేసాయి.
నిర్వాహకులకు అభినందనలు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను హాజరైన కుటుంబాలు అభినందించాయి. తమ పిల్లలకు సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షులు జగదీశ్ రావు చీటీ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాధారపు, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్ రావు, ఆనంద్ శంకర్, సాయి చందర్, ఎస్ పి కస్తూరి, సురేష్ రెడ్డి, రాజ శేఖర్ తోట, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచార్యులు, రాము కందుకూరి, మమత కస్తూరి, రఘు ఎలిగేటి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, రమణ స్వర్గం, సారిక పీచర, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, కార్తీక్ రెడ్డి, వనజ గోగుల, అజర్ ఖాన్, రాము జల, సరోజ అల్లూరి, మౌనిక గౌడ్, రనీషా, స్వప్న, ప్రియ, విపుల, చంద్రలేఖ, లక్ష్మి, శ్వేత, సుమజ, రమ్య, అనూష, సంగీత, సౌందర్య, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.