/rtv/media/media_files/2026/02/07/fotojet-3-2026-02-07-15-10-21.jpg)
Bomb threat to Vande Bharat trains.
Vande Bharat Trains : వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే అధికారులకు పంపిన లేఖ కలకలం రేపింది. ఫిబ్రవరి 3న అగంతకుడు జీఎంకి పోస్టులో లేఖ పంపించాడు. హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు సభ్యుల జిహాదీ బృందం పథకం వేసిందని అగంతకుడు ఆ లేఖలో తెలిపాడు. వందేభారత్ వెళ్లే రైల్వే లైన్లలో బాంబులు పెట్టి 250 మందిని చంపేదుకు పథకం వేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆ అంగతకుడు నలుగురు పేర్లను కూడా లేఖలో ప్రస్తావించాడు. దీంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు .. వందేభారత్ రైళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు పోలీసులు. లేఖ పంపించిన ఆంగతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లేఖను ఎవరైనా ఆకతాయిలు పంపించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఎవరైనా అనుమానితులు,వస్తువులు కనిపించినా 139 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
ఈ బెదిరింపు లేఖతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం (RPF), పోలీసులు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా వందేభారత్ ట్రైన్లు, అన్ని రైల్వే స్టేషన్లు, ట్రైన్ ట్రాకుల వెంట బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేయడంతో పాటు ఆయా స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇది నిజంగానే ఉగ్రవాద కుట్రనా? లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని చేసిన పనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే అధికారులు ఇప్పటికే గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైన్లలో కానీ.. స్టేషన్లలో గానీ ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని రైల్వే అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు.
ఈ మేరకు పోలీసులు లెటర్ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రాథమిక బాధ్యత అని.. ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. గతంలోనూ ట్రైన్లకు ఆకతాయిలు ఇలాంటి బెదిరింపు లెటర్లు పంపారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే లెటర్ పంపిన ఆగంతకుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.
Follow Us