/rtv/media/media_files/2025/01/22/yQeT6HkbNqAkCuWMMY5T.webp)
Shamshabad Airport
High alert : శంషాబాద్ ఎయిర్ పోర్టు లో హై అలర్ట్ ప్రకటించారు. ఒక్కసారిగా బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టడంతో అక్కడున్న ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతుందో అర్ధం కాక కొంత సేపు అయోమయానికి గురయ్యారు. అయితే ఈ నెల 15న స్వాతంత్య్రదినోత్సవం జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాలకు కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. దీంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానశ్రయంలో తనిఖీలు చ
Also Read : నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే
15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు అంగరంగ ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉంటుందనే అనుమానంతో ముందస్తుగా విమానశ్రయాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నిఘా వర్గాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే విమానశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కారణంగా సాధారణ సందర్శనకు అనుమతి తాత్కలికంగా ఎత్తివేశారు. అలాగే అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి హైదరాబాద్ విమానశ్రయానికి అనేక విమానాలు నేరుగా వస్తుండటంతో ముందస్తు భద్రతలో భాగంగా.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో ఎయిర్ పోర్టు అంతటా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ హైఅలర్ట్ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని విమానశ్రయ అధికారులు వెల్లడించారు.
రూ.13.3 కోట్ల విలువు చేసే గంజాయి పట్టివేత
కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలిపై అనుమానం రావడంతో డీఆర్‌ఐ అధికారులు ఆమె వద్ద ఉన్న బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో బ్యాగులో 20 ప్యాకెట్ల గంజాయి లభించగా, వెంటనే స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!