TG News: రేవంత్ ఖబర్దార్.. మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తావా? సీఎంకు ఏలేటి మహేశ్వర రెడ్డి వార్నింగ్!

ప్రధానీ మోదీ కులం గురించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. రేవంత్ ఖబర్దార్ ప్రధానిపై తప్పుడు వ్యాక్యాలు చేస్తే చరిత్ర హినుడిగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. పదవిని కాపాడుకొనేందుకు ఇలా మాట్లాడుతున్నారన్నారు.

New Update
Alleti Maheshwar Reddy

BJP Alleti Maheshwar Reddy Strong Counter To CM Revanth Reddy

TG News: ప్రధానీ మోదీ కులంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ ఖబర్దార్ ప్రధానిపై తప్పుడు వ్యాక్యాలు చేస్తే చరిత్ర హినుడిగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. రేవంత్ పదవిని కాపాడుకొనేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

రాహుల్ బాటలోనే రేవంత్..

ప్రధానిగా ఉండటం ఓర్వలేకే గతంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. రాహుల్ బాటలోనే రేవంత్ పిచ్చి మాటు మాట్లాడుతున్నారని, రేవంత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశారు ఏలేటి. 

రేవంత్ రెడ్డి పిచ్చి పనులను కప్పిపుచ్చడానికి ఇలా మాట్లాడుతున్నారు. బీసీ కులగణలో ఫెయిల్ అయినందుకు పిచ్చెక్కి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఏ మంతం. ఆయన కన్వర్ట్ హిందువు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తప్పుడు లెక్కల కులగణనను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సీఎం కుర్చి కాపాడుకునేందుకు నీచమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీసీ వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావడం వారికి మింగుడు పడట్లేదన్నారు. 

రేవంత్ ఏమన్నారంటే.. 

ఈ మేరకు శుక్రవారం గాంధీ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ బీసీ బిడ్డ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు. మోదీ 2002 వరకు ఆయన ఉన్నత వర్గల్లోనే ఉన్నట్లు తెలిపారు. ఇందతా తాను అషామాషిగా చెప్పట్లేదని, అన్ని తెలసుకుని మాట్లాడుతున్నానన్నారు.  రాహుల్ గాంధీ మోదీ మెడలు వంచుతారనే కులగణనపై బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. మోదీ బీసీ కాదు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు.

ఆయన బీసీ అయితే ఇన్నాళ్లు కులగణన ఎందుకు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణనను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ లెక్కలను తప్పు పడితే నష్టపోయేది బీసీలే. వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మేము ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేస్తే దాన్ని కూడా తప్పుపట్టాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దు. త్వరలోనే దీన్ని చట్టం చేయబోతున్నాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇండ్లముందు మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్లను లైన్ లో పెట్టి లెక్కగట్టండి. కులగణనలో నమోదు చేయించుకోకపోతే కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు