/rtv/media/media_files/2025/08/30/telangana-local-body-elections-2025-08-30-15-02-58.jpg)
Telangana Local Body Elections
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంచలన అప్‌డేట్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సీఎం రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితిపై తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక జీవో తీసుకొచ్చి కులగణన ఆధారంగానే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది.
Also Read: వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు.. రూ.558.90 కోట్ల నష్టం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోగా నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు గత ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించి ఉండకూడదని 2018 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కానీ తాజాగా రేవంత్ సర్కార్ ఈ పరిమితిని ఎత్తివేసి ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించింది. ఇక ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని ఢిల్లీలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఇతర కీలక నేతలు నిరసన చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read: అసెంబ్లీకి రాను.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం ప్రకటన