Vikarabad Murder: వికారాబాద్ లో దారుణం..కుటుంబాన్ని కడతేర్చిన కసాయి..ఆ తర్వాత ఏం చేశాడంటే

ఓ వ్యక్తి నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సంచలనం సృష్టించింది.ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు వదినను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు.

New Update
murder

murder

Vikarabad Murder:  ఓ వ్యక్తి నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సంచలనం సృష్టించింది.ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కుమార్తె తో పాటు వదినను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. మరో కూతురును చంపేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. ఆ తర్వాత అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు అలివేలు(32), హనుమమ్మ(40) శ్రావణి(10), యాదయ్య(38)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.

కుల్కచర్ల  గ్రామంలో అలవేలు, యాదయ్య అనే దంపతులు ఇద్దరు  కూతుళ్లు శ్రావణి, అపర్ణతో  కలిసి నివాసం ఉంటున్నారు.  రోజువారీ కూళీగా పనిచేసే యాదయ్య..తన  భార్య అలవేలుపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య రోజూ గొడవలు అయ్యేవి. ఈ విషయంలో గత కొంతకాలంగా గొడవ పడుతున్నారని  స్థానికులు  చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు అతడి వదిన హన్మమ్మ ఇంటికి వచ్చిందంటున్నారు.  ఈ రోజు ఉదయం కూడా భార్యభర్తల మధ్య వివాదం చెలరేగగా వదిన వారించే ప్రయత్నం చేసింది దీంతో వదిన , భార్యా ఇద్దరు కూతుళ్లపై యాదయ్య కొడవలితో దాడి చేసి ఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో  భార్య,వదిన, కూతురు చనిపోగా.. మరో కూతురు అపర్ణ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఈ దారుణ హత్యలు చేసిన అనంతరం యాదయ్య తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

స్థానికుల సమాచారంతో  ఘటనాస్థలాన్ని పరిశీలించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి హత్యలకు, అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని  పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ చెప్పారు.

Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్

Advertisment
తాజా కథనాలు