SI Harish: వాజేడు ఎస్‌ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాజేడు SIగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ప్రేమించిన యువతి వేధింపుల వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By K Mohan 02 Dec 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ఎస్సై సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతితో హరీశ్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సై హరీష్‌కు ఆమె సోషల్‌మీడియాలో పరిచమైంది. గత కొంతకాలంగా ఇద్దరిమధ్య సాన్నిహిత్యం ఉంది. యువతి వేధింపుల వల్లే హరీష్ చనిపోయాడని హరీశ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అటు ఆదివారం ములుగు జిల్లా ఏటూరు నాగరంలో జరిగిన మావోయిస్టు ఎన్ కౌంటర్ తో ఎస్సై ఆత్మహత్యకు సంబధం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలేంటి అనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్ అసలు ఏం అయ్యింది ఎస్సై హరీష్‌కు పెళ్లి ఖాయమైందన్న విషయం తెలుసుకుని.. హరీశ్ ను యువతి వేధింపులకు గురి చేసింది. డిసెంబర్ 6న ఎస్సై హరీశ్ ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం కూడా ఖరారైంది. డిసెంబర్ 1న యువతి వాజేడుకు వెళ్లి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని హరీశ్ ను కోరింది. ఎస్సై హరీశ్ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా యువతి వినిపించుకోలేదు. తనను పెళ్లి చేసుకోలని ఒత్తిడి చేసింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో క్షణికావేశంలో హరీష్ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. Also Read: TS: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి Also Read: నాకు అసలు అరెస్ట్ వారెంటే ఇవ్వలేదు–రాంగోపాల్ వర్మ Also Read: కాంగ్రెస్ లోకి హరీష్ రావు.. మాజీ సీఎంతో మంతనాలు! #vajedu #si #harish #sucide #mulugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి