Chevella Accident: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి

తెలంగాణలోని చేవెళ్లల్లో ఘోరం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర కూరలమ్ముకుంటున్న వారి మీద లారీదూసుకెళ్ళింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా...మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. 

New Update
accident

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం దాదాపు పాతిక మంది జీవితాలను బలితీసుకుంది. రంగారెడ్డిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అక్కడ తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాళ్ల పైకి లారీ దూసుకెళ్లింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడే స్పాట్లోనే చనిపోయారు. మరో ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు విరిగి కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్ధరిల్లిపోయింది. లారీ డ్రైవర్ సైతం ప్రాణాలు దక్కించుకునే స్థితిలో కనిపించడం లేదు. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతనిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే లారీ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. హైదరాబాద్- బీజాపూర్ హైవేపై ఈ ఘటన జరిగింది.

హాఠాత్తుగా దూసుకొచ్చిన లారీ...

ఉన్నట్టుండి లారీ దూసుకురావడంతో ప్రమాదాన్ని ముందుగా ఎవరూ గుర్తించలేకపోయారు. దాంతో ఎక్కువ నష్టం జరిగింది. రోడ్డు మీద ఉన్న కూరలమ్మే వారిని లారీ ఢీకొట్టిన తర్వాత అలాగే నేరుగా దూసుకుపోయి చెట్టు ఢీకొట్టింది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అతి వేగం, సమయానికి బ్రేక్‌లు పడకపోవడం ప్రమాదానికి కారణాలుగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలం అంతా అల్లకల్లోలంగా కనిపిస్తోంది. రక్తం మడుగులతో నిండిపోయింది. 

 ఇది కూడా చదవండి: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్

Also Read: కాంగ్రెస్ లోకి హరీష్‌ రావు.. మాజీ సీఎంతో మంతనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు