RGV: నాకు అసలు అరెస్ట్ వారెంటే ఇవ్వలేదు–రాంగోపాల్ వర్మ

నాకసలు అరెస్ట్ వారెంటే ఇవ్వలేదు పారిపోయాయని ఎలా అంటారు అంటూ రాంగోపాల వర్మ మాట్లాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక ఏడాదిలో ఎన్నో వేల పోస్టులు పెట్టాను...నాకు గుర్తు కూడా ఉండవు అని కామెంట్ చేశారు. 

New Update
RGV.

ఎప్పుడో పెట్టిన పోస్ట్‌కు ఇప్పుడు మనో భావాలు దెబ్బతినడం ఏంటో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని రాంగోపాలవర్మ వ్యాఖ్యలు చేశారు. ఒక ఏడాదిలో తాను ఎన్నో పోస్ట్‌లు పెట్టి ఉంటా...అవేంటో తనకు గుర్తు కూడా ఉండవని అన్నారు. ఒక పోస్ట్‌ మీద నలుగురైదుగురు కేసులు పెట్టడం ఏంటో వాళ్ళకే తెలియాలి అన్నారు. ఇప్పుడు నాకు నోటీస్ లు పంపించారు. నవంబర్ 25న రావాలి అని చెప్తే నేను పోలీసులకు మెసేజ్ పెట్టా.. కానీ వాళ్ళు కొన్ని మీడియా సంస్థలతో కలసి వచ్చారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయి. 

ఎక్కడికీ పారిపోలేదు..

చాలా పత్రికల్లో,  టీవీల్లో నేను పారిపోయానని వార్తలు రాస్తున్నాయి. కానీ నేను ఎక్కడికీ పారిపోలేదు. నేను నా డెన్‌లోనే ఉన్నాను. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అలాఆంటప్పుడు పారిపోయానని ఎలా అంటారు. క్రితం సారి పోలీసులు నా దగ్గర కు వచ్చినప్పుడు...అరెస్ట్  వారెంట్ ఇవ్వలేదు. అరెస్ట్ చేయ్యడానికి వచ్చామని కూడా చెప్పలేదు. అయినా అసలు నేను ఏది ట్వాట్ పెట్టినా జనాలు తిడతారు. తాను ఒక ట్వీట్ పెడితే 90 శాతం నన్ను బూతులు తిడతారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాంటది ఇప్పుడు కొత్తగా కేసులు ఏమిటో అర్ధం కావడం లేదు అంటూ రాంగోపాల వర్మ మాట్లాడారు. 

Also Read: TS: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు