/rtv/media/media_files/2025/10/08/high-court-2025-10-08-13-52-10.jpg)
High Court
Ibrahimpatnam Municipality : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కనిపించకుండా పోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ తనను బీఆర్ఎస్ నేతనే కిడ్నాప్ చేశాడని ఆరోపించడం కలకలం రేపింది.
వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ క్యాంపునకు వెళ్లిన తన తండ్రి కనిపించడం లేదని 19వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుమారుడు నిన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే యాదగిరి నిన్న అందరితో పాటే ఎన్నికకు వచ్చి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు చెయ్యేత్తి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలోనూ పాల్గొన్నాడు. అయితే ఆయన కుమారడు వేసిన పిటిషన్ నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంటూ ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయతే యాదగిరి విషయంలో క్లారిటీ వచ్చేంతవరకు ఎన్నిక నిర్వహించవద్దని కోర్టు ఆదేశించడంతో ఎన్నిక పూర్తయినా ధ్రువీకరణ పత్రాలు మాత్రం ఎన్నికల అధికారి అందించలేదు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!
మంచిరెడ్డి కిషన్ రెడ్డికి షాక్
కాగా యాదగిరిని కోర్టు ముందు హాజరువరుచాలని కోర్టు ఆదేశించడంతో ఈరోజు యాదగిరి ధర్మాసనం ముందు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కిడ్నాప్ గురించిన వాదనలు వినిపిస్తూ తనను బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి(manchireddy-kishan-reddy) తో పాటు ఆయన కుమారుడు తనను బలవంతంగా తీసుకెళ్లారని కోర్టుకు తెలపడం కలకలం రేపింది. తనను బాపట్ల జిల్లా చీరాల తీసుకువెళ్లారని, తాను బీఆర్ఎస్(brs) తరుపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని అందువల్ల తనను బౌన్సర్లతో బెదిరింపులకు గురిచేశారని చెప్పి షాక్ ఇచ్చాడు. తనను మానసిసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారని కోర్టుకు వివరించడంతో కిషన్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. మున్సిపల్ ఎన్నిక(Muncipal Election News) ల్లో ఇష్టపూర్వకంగానే ఓటింగ్ వేసినట్లు అందరికీ చెప్పాలంటూ తనను ప్రలోభపెట్టారని చెప్పడమే కాకుండా మళ్లీ ఎన్నికను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోర్టును కోరటం బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో స్పందించిన న్యాయమూర్తి ఎన్నికలు పూర్తయ్యే వరకు యాదగిరికి రక్షణ ఇస్తామని చెప్పింది.
ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పీఠంపై విధించిన స్టే ను తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎత్తివేసింది. అయితే యాదగిరి విషయంలో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందన్నది సస్పెన్స్‌గా మారింది. యాదగిరి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా? లేక తనకు చైర్మన్ అవకాశం ఇస్తే కేసును వెనుకకు తీసుకుంటారా? అనేది తేలాల్సిఉంది. నిన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్కిన చైర్మన్, వైస్ చైర్మన్ పీటం వారికే ఉంటుందా? జే జారుతుందా అనేది తేలాల్చి ఉంది.
Also Read : తెలంగాణలో మరో ఎన్నికల నోటిఫికేషన్.. ఎప్పుడంటే?
Follow Us