/rtv/media/media_files/2025/05/02/GlWaYTPOCf6cIZQJC94j.jpg)
Sheep scam broker Moinuddin arrested
Sheep Distribution Scam: తెలంగాణలో(Telangana) గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులవృత్తులను కాపాడటం కోసం గొల్లకుర్మలకు గొర్రెలు అందజేసింది. అయితే కొంతమంది దళారులు ఈ పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. గొర్రెల స్కీమ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు స్కామ్‌కు పాల్పడి రూ.1200 కోట్లు కొట్టేశారు. అత్యంత సంచలనంగా మారిన ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. అయితే ప్రధాన సూత్రదారిగా భావిస్తోన్నదళారి మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతన్ని నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ(ACB) అధికారులకు అప్పగించింది.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
గొర్రెల స్కాం కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మొయినుద్దీన్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు. మొయినుద్దీన్ తో పాటు ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరి పాస్ పోర్టులను అధికారులు ఇన్పౌండ్ చేశారు. ఈ క్రమంలోనే మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
గొర్రెల పంపిణీ స్కామ్..
రాష్ర్టంలో గొర్రెల స్కామ్ వెలుగులోకి రాగానే మొయినుద్ధీన్‌తో పాటు ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ దేశం విడిచి పారిపోయారు, వారిని దేశం రప్పించడం కోసం పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కాం కేసులో ఇప్పటి వరకు17 మందిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. లోలోన ది లైవ్ కంపెని పేరుతో దళారి వ్యాపారానికి మొయినుద్దీన్ అతని కుమారుడు ఈక్రముద్దీన్ తెరలేపారు. ఈ స్కీంలో స్కాం జరిగిందని తెలియగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.ఇవాళ A1 నిందితుడు అయిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని వెంటనే విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో మొయినుద్దీన్‌దే కీలక పాత్ర అని అధికారుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
కాగా మొహినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొహినుద్దీన్ భార్య కోకాపెట్‌లోని మూవీ టవర్స్ నివాసంలో ఉంటున్నారు. మొహినుద్దీన్ నుంచి అతని భార్య బ్యాంకు ఖాతాకు భారీగా నగదు బదిలీ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సెర్చ్ వారెంట్ చూపించి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు. సోదాల అనంతరం రెండు కార్లతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో నాడు పశుసంహర్థక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ కు కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన ఓఎస్డీ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయడంతో తలసాని కి(Talasani Srinivas Yadav) కూడా తప్పకపోవచ్చని నాడు ప్రచారం సాగింది. కాగా ఇప్పుడు మొహినుద్దీన్ అరెస్ట్ నేపథ్యంలో తలసానికి తలనొప్పి తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?