Koneru Konappa : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. సిర్పూర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోనేరు కోనప్ప గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

New Update
 Koneru Konappa

Koneru Konappa

Koneru Konappa : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. సిర్పూర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోనేరు కోనప్ప గత ఎన్నికల తర్వాత మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరనని కూడా వెల్లడించారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటాన‌ని తెలిపారు కోనేరు కోన‌ప్ప.

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

సామాజిక సేవద్వారా గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప వేసవికాలంలో సిర్పూర్ లో అంబలికేంద్రాలు నిర్వహించే వారు. దానితోనే ఆయన వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన కోనప్ప 2004లో మొద‌టిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయారు. 2014లో బీఎస్పీ టికెట్ పై గెలిచారు. అయితే నిర్మల్ నుంచి బీఎస్పీ టికెట్ పై గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి కోనప్ప నాటి అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరారు.2018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి మ‌ళ్లీ గెలుపొందారు. కానీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కోన‌ప్ప బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కోనప్ప గతేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో హ‌స్తం పార్టీ కండువా క‌ప్పుకున్నారు. 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

తాజాగా సిర్పూర్‌లో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న విబేధాల కార‌ణంగానే కోనేరు కోన‌ప్ప పార్టీని వీడుతున్నట్లు తెలిసింది. కాగా కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రస‌న్న హ‌రికృష్ణకు మ‌ద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే నిర్మల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ చేతిలో ఓడిపోయి ఆతర్వతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వీరిద్దరూ కూడా త్వరలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది.

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

Also Read: Flipkart Mobile Offers: ఇదెక్కడి ఆఫర్రా బాబు.. మతిపోతుంది: ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.50వేల ఫోన్ పై భారీ డిస్కౌంట్!


Advertisment
తాజా కథనాలు