/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
Police Officers: పోలీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని పోలీసులను ఉద్దేశించి కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు. పోలీసులు తమ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ భార్య మీద అటెమ్ట్ మర్డర్ కేసు పెడతారా?. మెడకాయ మీద తలకాయ ఉండి పనిచేస్తున్నారా? అంటూ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసు అధికార్లు ఎవరెవరు ఎగిరి పడుతున్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. అన్ని లెక్కలు మిత్తితో సహా తేలుస్తాం’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఖండించింది. చట్ట ప్రకారం కేసులు నమోదు చేసే పోలీసుల్ని దూషించడం ఏం సంస్కృతి అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులనుద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసులపై మరోసారి పరుష పదజాలం పునరావృతమైతే కేటీఆర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Also Read:కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ