ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు కాస్త ఊరట దక్కింది. అరెస్టుపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. జనవరి 28 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది. Also Read: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట! ఇదిలాఉండగా.. తన ఫోన్‌ను హరీశ్ రావు ట్యాపింగ్ చేయించారని రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకోని విచారించాల్సిన అవసరం ఉందని పంజాగుట్ట పోలీసులు హైకోర్టుకు తెలియజేశారు. మరోవైపు ఈ కేసును కొట్టేయాలంటూ హరీశ్‌రావు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఆయన్ని అరెస్టు చేయొద్దని గతంలో కూడా హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది.దీంతో పంజాగుట్ట ఏసీబీ మోహన్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు హరీశ్ రావు ఈనెల 28 వరకు అరెస్టు చేయరాదని.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మరోసారి ఆదేశించింది. Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా అయితే చక్రధర్ గౌడ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటికే నమోదు చేశారు. హరీశ్ రావు తనపై కక్ష పెంచుకున్నాడని.. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి వేధించాడని చక్రధర్ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే రెండో నిందితుడైన రాధాకిషన్ రావు కూడా తనన బెదిరించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లి భౌతికదాడికి పాల్పడినట్లు చెప్పారు. అయితే ఈ కేసులో హరీశ్ రావు త్వరలో అరెస్టవుతారా ? లేదా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది.