/rtv/media/media_files/2025/04/18/PuYshqSVuN4YWFHBmMfi.jpg)
rains Photograph: (rains)
BIG BREAKING: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఇది ఒడిశా నుంచి విశాఖ వచ్చి.. తర్వాత మళ్లీ బంగాళాఖాతంలోకి వెళ్లింది. సోమవారం సాయంత్రం సమయంలో మళ్లీ ఒడిశాలో తీరం దాటనుంది. అల్పపీడన ప్రభావం ఏపీ, తెలంగాణపై ఎక్కువగా కనిపిస్తోంది.
భారత వాతావరణ శాఖ ప్రకారం ఇవాళ తెలంగాణకి తీవ్ర భారీ వర్ష సూచన చేసింది. దీంతో తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో మరో 7 రోజులు భారీ వర్షం కురిసే అవకాశంఉంది. అలాగే.. తెలంగాణలో 18, 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే.. రానున్న5 రోజులపాటూ.. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19వరకూ గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి..భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం..నిర్మల్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో 5 రోజులపాటూ.. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి..కాకినాడ,విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీలో రోజంతా మేఘాలు కమ్ముకుంటాయి. ఉదయం 10 తర్వాత ఉత్తరాధ్రలో జల్లులు మొదలవుతాయి. అవి కంటిన్యూగా రోజంతా కురుస్తాయి. మధ్యాహ్నం 2 తర్వాత రాయలసీమలో కూడా జల్లులు కురుస్తాయి. అక్కడ కూడా క్రమంగా వాన కొద్దిగా పెరుగుతుంది. రాత్రి 12 తర్వాత రాయలసీమలో వాన తగ్గే అవకాశం ఉంది. సాయంత్రం 4 తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తాలో మోస్తరు వర్షాలు మొదలై.. కంటిన్యూ అవుతాయి. అర్థరాత్రి వరకూ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడా కురుస్తూనే ఉంటాయి. సోమవారం తెల్లవారుజాము వరకూ కురిసే అవకాశం ఉంది.
ఉదయంవేళ ఉత్తర తెలంగాణలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం 12 తర్వాత ఉత్తర తెలంగాణ అంతటా మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉంది.సాయంత్రం 4 వరకు ఉత్తర, మధ్య తెలంగాణలో కూడా వానలు మొదలవుతాయి. సాయంత్రం 5 తర్వాత తెలంగాణ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవాకాశం. ఆ సమయంలో ఉత్తర, మధ్య తెలంగాణలో కొంత ఎక్కువగా వానలు పడతాయి. హైదరాబాద్‌లో రాత్రి 7 తర్వాత నుంచి వర్షం పెరిగే ఛాన్స్ ఉంది. మోస్తరు వాన కురవవచ్చు. హైదరాబాద్, ఆ పరిసరాల్లో సోమవారం రోజంతా కురుస్తూనే ఉంటుంది.
గాలి వేగం అరేబియా సముద్రంలో గంటకు 41 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 10కిలో మీటర్లు, ఏపీలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలి వేగం తక్కువగా ఉంటే వర్షం పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం గంటకు 43 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. ఐతే ఇది ప్రస్తుతానికి వాయుగుండంగా మారకపోవచ్చు. ఎందుకంటే.. ఇది తీరం దాటేలా.. తీరం పక్కనే తిరుగుతోంది.
మొత్తంగా చూస్తే.. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అలాగే.. ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం బాగా ఉంటోంది. విశాఖ పరిసరాల్లో వర్షాలు బాగా పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటార్కిటికాకు చెందిన కొత్త సెట్ మేఘాలు.. భూమధ్య రేఖకు దగ్గర్లోకి వస్తున్నాయి. మరో వారంలో అవి.. ఇండియాని టచ్ చేయవచ్చు. ఆల్రెడీ చాలా మేఘాలు సౌత్ ఇండియా అంతటా ఉన్నాయి. ఈ నెలంతా వానలు కురుస్తాయని అనుకోవచ్చు.
Also Read : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!