BC Reservations : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మంటలు రాజుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ విషయంలో పలు పార్టీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ప్రతి పక్షాలను ఉద్ధేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం వద్దు అన్న ఆయన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుకుని రిజర్వేనష్లు ఇచ్చుకోబోతున్నామని చెప్పారు.
ఇది కూడా చూడండి: Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!
తెలంగాణలో స్థానిక సంస్థలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారని ఆరోపించారు. గతంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఈ విషయంలో తప్పుగా మాట్లాడుతున్నారన్నారు. చివరకు మధుసూధనాచారి వంటి వారు కూడా అలా మాట్లాడటం సరికాదన్నారు. "చేతులు జోడించి వేడుకుంటున్నాను. రిజర్వేషన్ల అమలును అడ్డుకోవద్దు’ అంటు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు సాంకేతిక, న్యాయపరమైన అంశాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చూడండి:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు ఎన్నో దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారన్నారు. బీసీల ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో ఎక్కువమంది కాంగ్రెస్ నేతలే ఉన్నారన్నారు.బీసీ ఉద్యమానికి అండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు ఉన్నారన్నారు. బీసీ ఉద్యమం ఇతర కులాలకు వ్యతిరేకం కాదన్నారు. దశాబ్దాల బీసీల కల సాకారం అవుతున్న తరుణంలో ఎవరూ రాజకీయం చేయకుండా సహకరించాలని అన్ని పార్టీలను కోరారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. బీసీలు తమ రిజర్వేషన్లను వినియోగించుకుని రాజకీయంగా ఎదగాలని కోరారు.
ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
BC Reservations : చేతులు జోడించి వేడుకుంటున్నాను రిజర్వేషన్ల అమలును అడ్డుకోవద్దు..కేశవరావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మంటలు రాజుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ విషయంలో పలు పార్టీలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
K. Keshava Rao