Sunny Yadav: బెట్టింగ్ యాప్ కేసు.. సంచలనాలు బయటపెట్టిన సన్నీ యాదవ్ పేరెంట్స్!

బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు స్పందించారు. సూర్యాపేట నూతనకల్‌లోని సన్నీ ఇంటికి వెళ్లిన RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. భూములు, మెడికల్ షాపులతో పాటు చాలా ఆస్తులున్నాయని సన్నీ తండ్రి రవిందర్ చెప్పారు. 

New Update
sunny sr

Bayya Sunny Yadav Parents Reaction On sunny Arrest

Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు స్పందించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని సన్నీ యాదవ్ ఇంటినుంచి RTV గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా రవిందర్ కొడుకుపై ఆరోపణలు కొట్టి పారేశారు. తమకు వ్యవసాయ భూములున్నాయని, మెడికల్ షాప్ నడిపిస్తున్నామని చెప్పారు. అందులోనుంచే వచ్చిన డబ్బులతోనే ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బులతో ఇళ్లు కడుతున్నారనే చెప్పేదంతా అబద్ధం అన్నారు. కొత్త ఇంటిపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు.

మా ఆస్తుల వివరాలు ఇస్తాం.. 

మా కొడుకు మొదట్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని తెలిసి వద్దని చెప్పాం. వెంటనే ఆపేశాడు. చాలా రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం లేదు. అయినా మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. కావాలంటే మా బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ చూపిస్తా. మెడికల్ షాప్ బిల్స్, వ్యవసాయంపై వచ్చే ఆదాయం కూడా చూపిస్తామని చెబుతున్నారు. అలాగే మరో వారం రోజుల్లో సన్నీ నూతనకల్ వస్తున్నాడని, పోలీసులు అడిగిన సమాచారాన్ని పూర్తిగా ఇచ్చామని చెప్పారు. కానీ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సన్నీ పేరెంట్స్ ఇష్టపడకపోవడం గమనార్హం. 

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

సన్నీకోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు

ఇదిలా ఉంటే..  బయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట ఎస్పీ స్పందించారు. ఈ మేరకు ఆయన  RTVతో పలు సంచలన విషయాలు పంచుకున్నారు. బయ్యా సన్నీ యాదవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడనే కారణం మీద నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం అన్నారు. దీనికి సంబంధించి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అతడ్ని పట్టుకోవడానికి టెక్నికల్‌గా కూడా ప్రయత్నిస్తున్నామని అన్నారు. దానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ వేరే దేశంలో ఉన్నాడని అన్నారు. ఈ సందర్భంగా యువతకి, పబ్లిక్, విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. ఎవరు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ వైపు వెల్లకూడదని అన్నారు. ఇవన్నీ మిమ్మల్ని మోసం చేసే అప్లికేషన్లు అని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కోసం ఎవరైనా ప్రోత్సహించినా లేదా నడిపినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఇది కూడా చూడండి:దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

Advertisment
తాజా కథనాలు