Basara: అయ్యో.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. అమ్మా, నాన్న క్షమించండి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చింది. By Seetha Ram 12 Nov 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో సోమవారం ట్రిపుల్‌ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతోన్న స్వాతిప్రియ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. విద్యార్థిని స్వాతి మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. చంపేసి సూసైడ్‌గా చిత్రీకరించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు పోలీసులను నిలదీస్తున్నారు. మృతదేహాన్ని చూపించకుండానే మార్చురీకి తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్వాతి మృతి చెందిన సమయంలో ఆమె చేతిలో ఓ సూసైడ్ లెటర్ ఉంది. ఆ సూసైడ్ లెటర్ లో ఏముందో తాజాగా బయటకొచ్చింది. మొత్తం 6 పేజీల ఆ లెటర్ ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. అందులో ఏముందనే విషయానికొస్తే.. Also Read: AP: ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి రూ.15వేలు..! సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..! ''అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలివెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. అయినా తప్పట్లేదు.. ఐ మిస్ యూ సో మచ్. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు మీకే కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియలు రావాలి'' అంటూ స్వాతి ఆ లేఖలో పేర్కొంది. ఏం జరిగింది Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియ బాసర ట్రిపుల్‌ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్టల్‌లోనే ఉంటోంది. సోమవారం ఉదయం స్వాతిప్రియ స్నేహితులు టిఫిన్ చేయడం కోసం వెళ్లారు. గదిలో స్వాతిప్రియ మాత్రమే ఒంటరిగా ఉంది. వాళ్లు తిరిగివచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు సిబ్బందికి తెలియజేయగా.. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే స్వాతిప్రియా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్! అయితే మృతిరాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగత సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వాతిప్రియ మరణంతో ఆమె స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్జీయూకేటీలో వరుసగా ఇలా ఆత్మహత్యలు జరగడం కలకలం రేపుతోంది. #Basara IIT #suicide #Basara Student Suicide Letter #Basara IIIT Student Emotional Letter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి