సెలూన్, టైలర్స్ కు బిగ్ షాక్.. మహిళలను టచ్ చేస్తే జైలుకే!

'బ్యాడ్ టచ్'నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు యూపీ మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలూన్, టైలర్స్.. తదితర మహిళలకు సేవలందించే షాపుల్లో మహిళా సిబ్బందే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా, డ్యాన్స్, జిమ్ సెంటర్లలో సీసీ కెమెరా తప్పనిసరి చేసింది.   

New Update
 d ted

Women Commission: బార్బర్, టైలర్స్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ కీలక సూచనలు చేసింది. 'బ్యాడ్ టచ్'నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు ఇకపై మహిళల జుట్టు, దుస్తుల కొలతల విషయంలో స్వయంగా పురుషులు పనిలో పాల్గొనకూడదని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం మహిళా కమిషన్‌ సభ్యురాలు హిమానీ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్‌ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనల గురించి వెల్లడించింది. దుస్తులు కుట్టడం, కటింగ్ చేయడం వంటి వృత్తుల్లో ఉన్న పురుషులు అమ్మాయిలను అసభ్యంగా తాకుతున్నట్లు వేధింపుల ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, ఇందులో భాగంగానే మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read : KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!

బట్టల కొలతలు మహిళలే తీసుకోవాలి..

ఈ మేరకు 'అమ్మాయిల బట్టల కొలతలు మహిళలే తీసుకోవాలి. సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఉండాలి. సెలూన్‌లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే  సేవలందించాలి. జిమ్‌, యోగా సెంటర్లలో కూడా మహిళా ట్రైనర్లే ఉండాలి. డ్రామా ఆర్ట్‌ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డ్యాన్స్‌ టీచర్లను ఏర్పాటు చేయాలి. జిమ్‌లను వెరిఫికేషన్‌ చేయాలి. స్కూల్‌ బస్సుల్లో మహిళా ఆయా, ఉపాధ్యాయిని ఉండాల్సిందే. కోచింగ్ సెంటర్లలో వాష్‌రూమ్‌లు, సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. మహిళల వస్తువులను విక్రయించే దుకాణాల్లో మహిళా సిబ్బంది ఉండాలి' అని హిమానీ తెలిపారు. ఇక ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు యూపీ ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె తెలిపారు. దీనిపై దేశం నలుమూలలనుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

Also Read: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!

Advertisment
తాజా కథనాలు