/rtv/media/media_files/2025/02/20/wC4Bl9jp9wda8nBUy4FP.jpg)
Phone tapping case:
కాగా ఈ కేసులో దర్యాప్తు పై మార్చి 3 వరకు హైకోర్టు స్టే విధిచింది. కాగా మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో హరీష్ రావు వద్ధ పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఓ రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఏ1గా మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు,ఏ2గా రాధాకిషన్ రావును పోలీసులు చేర్చారు. కాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం జరిగిన విచారణలో జస్టీస్ లక్ష్మణ్ పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్