phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరికీ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్, ఆడిషనల్ ఎస్పీ భుజంగరావులకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రూ. లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని, పాస్ పోర్టు సమర్పించాలని ఆదేశించింది.