CP CV Anand : నగరవాసులకు గుడ్ న్యూస్..ఇక రోడ్లపై దూసుకెళ్లచ్చు

హైదరాబాద్ లో  ట్రాఫిక్ యాక్షన్‌ ప్లాన్‌‌ను అమలు చేయడం వల్ల యావరేజ్‌స్పీడ్‌ పెరిగిందని నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నగరంలో అమలు చేస్తున్న ట్రాఫిక్‌ యాక్షన్‌ ప్లాన్‌ను వివరించారు.

New Update
CV Anand

Average speed has increased in Hyderabad

హైదరాబాద్ లో  ట్రాఫిక్ యాక్షన్‌ ప్లాన్‌‌ను అమలు చేయడం వల్ల యావరేజ్‌స్పీడ్‌ పెరిగిందని నగర పోలీస్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన నగరంలో అమలు చేస్తున్న ట్రాఫిక్‌ యాక్షన్‌ ప్లాన్‌ను వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 18 కిలో మీటర్ స్పీడ్ ఉండేదని.. ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందని సీపీ తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరంతరం  కష్టపడితేనే ఈ ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని... ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. నగరంలోని మూడు కమిషనరేట్ ల పరిధిలో ఒక్కరోజు 91 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయన్న ఆయన రోజుకు 1600 వాహనాలు పెరుగుతున్నాయని వివరించారు.

Also Read :  వర్షిణి విడుదల .. జైల్లోనే అఘోరీ శ్రీనివాస్ !

CP CV Anand

నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సైంటిఫిక్ పద్ధతులను అవలంభిస్తున్నామని డ్రోన్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీవీ ఆనంద్‌ వివరించారు. ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట్ల డ్రోన్లు వాడుతామన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం హైరైజ్ కెమెరాలు  తీసుకువచ్చామని చెప్పారు. ఎక్కువ ఎత్తు కలిగిన బిల్డిగ్స్ యజమానులను ఒప్పించి అక్కడ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రస్తుతం 25 ప్రాంతాల్లో ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీని ట్రాఫిక్ కు సంబంధించి బర్డ్ ఐ వ్యూ విజువల్స్ లభిస్తున్నాయన్నారు. ఇది కొత్త ఆలోచన అని రాబోయే రోజుల్లో ఈ హైరైజ్ కెమెరాలను పెంచబోతున్నట్లు చెప్పారు.

Also Read :  నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు..ఎంపీ డీకే అరుణ సంచలన ఆరోపణ

వీఐపీ మూమెంట్‌పై ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామన్న ఆయన ముఖ్యమంత్రి వెళ్లే సమయంలోనూ ట్రాఫిక్ ఆపవద్దని ఆదేశాలు ఇచ్చారని. ఇది శుభపరిణామమన్నారు. హైదరాబాద్‌‌లో 80 శాతం  సిగ్నల్స్ ఆటో మోడ్ నడుస్తుందని... దీని వలన ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతుందని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై జరిమానాల్లో సంఖ్య ప్రాధాన్యత కాకుండా.. క్వాలిటీపై దృష్టి పెట్టి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.. దీంతో ట్రాఫిక్ జరిమానాలు గణనీయంగా తగ్గాయన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్‌ను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని సీపీ ఆనంద్‌ వివరించారు.  

Also Read :  కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్

హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మరింత చక్కదిద్దేందుకు గూగుల్ కంపనీ సహాయం తీసుకుంటున్నామన్నారు. గూగుల్ మ్యాప్స్‌తో పాటు టెక్నీకల్‌గా గూగుల్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండడం వలన ట్రాఫిక్ మార్షల్ సిస్టంను తీసుకొస్తున్నామన్నారు.. కార్పొరేట్ రెస్పాన్స్‌బులిటీ కింద వారే నియమించుకోవాలన్నారు. ట్రాఫిక్ మార్షల్‌కు తాము ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని ఉపయోగిస్తామన్నారు.  తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్లు బాగా పని చేస్తున్నారని.. మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

 ఫుట్‌పాత్‌ ఆక్రమణలు గణనీయంగా తగ్గాయన్న సీపీ ఆనంద్‌ ఆక్రమణల తొలగింపునకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్ సమన్వయంగా ముందుకు వెల్లుతున్నామని చెప్పారు. నగరంలో రాత్రి పూట  ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు న్యూసెన్స్ చాలా ఎక్కువ ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయి.. దానిపై కూడా వారి యాజమాన్యాలతో మీటింగ్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

Also Read :  వరంగల్‌ కోర్టులో బాంబుల కలకలం..హై అలెర్ట్‌ ప్రకటించిన పోలీసులు

 

hyderbad-cp-cv-anand | hyderabad-cp-cv-anand | Telangana Traffic Rules latest update | Telangana Traffic Rules | Hyderabad New Traffic Rules | new traffic rules in hyderabad | New Traffic Rules

Advertisment
Advertisment
తాజా కథనాలు