మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు. అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు, మంత్రి పొంగులేటి వద్దకు వెళ్లి తన మీద ఉన్నది లేనిది చెబుతున్నాడంటూ సురేఖ కామెంట్ చేశారు. టీడీపీలో నడిచినట్లే.. కాంగ్రెస్ లో కూడా నడుస్తుందని ప్లాన్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన, తనకు అదృష్టం ఉన్నప్పుడు తాను మంత్రి అయ్యానని తెలిపారు. తన కూతురికి అదృష్టం లేదు కాబట్టే ఎమ్మెల్యే కాలేదని, కడియం కూతురికి అదృష్టం ఉంది కాబట్టే ఎంపీ అయిందన్నారు. ఇప్పుడు తాను ఆమె పదవిని తీయించాలని అనుకోవడం సరికాదన్నారు. మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు
మరోవైపు వరంగల్ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో వారంతా భేటీ అయ్యారు. సమావేశానికి జిల్లాకు చెందిన ఒక ఎంపీతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి సైతం ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్లు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా హైకమాండ్ ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు.
konda surekha : కడియం నల్లికుట్లోడు .. మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్లోడు అంటూ సంబోధించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడంటూ వ్యాఖ్యనించారు.