New traffic rule : వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కొత్త రూల్ తీసుకురాబోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరి చేయాలని నిర్ణయించుకుంది. ఈమేరకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కొత్త, పాత వాహనాలకు లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి కానుంది.