/rtv/media/media_files/2025/07/13/heavy-security-at-kavitha-house-2025-07-13-19-57-00.jpg)
Heavy security at Kavitha's house
Heavy security : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్యూన్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆఫీసులో పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నవీన్ గన్‌మెన్ లు కాల్పులు జరపడంతో జాగృతి కార్యకర్తలు గాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా చింతపండు నవీన్ (మల్లన్న) మాట్లాడుతూ ఇకపై బీసీల తడాఖా చూపిస్తామని ఎమ్మెల్సీ కవితకు, జాగృతి కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కవిత ఇంటిపై మల్లన్నవర్గం దాడి చేస్తుందన్న ప్రచారంతో హైదరాబాద్‌లోని కవిత నివాసం, ఆఫీసు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!
రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో చింతపండు నవీన్ (మల్లన్న) మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయగా, ఆయన గన్‌మెన్ గాలిలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడిని తనను చంపే కుట్రగా మల్లన్న ఆరోపిస్తూ... ఇకపై తఢాఖా చూపిస్తామని హెచ్చరించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న అనుమానంతో ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛిత సంఘటనలను జరగకుండా ప్రత్యేక బృందాలను మోహరించారు. కాగా చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలు, గన్‌మెన్ కాల్పులను ఖండిస్తూ కవిత శాసనమండలి అధ్యక్షులు, డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు