/rtv/media/media_files/2025/04/14/Uj2xuXGjdwV8DPuB4flz.jpg)
Vemulawada Murder
Vemulawada Murder: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను తెలిసిన వ్యక్తులే హతమర్చారు. మృతుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. పాత కక్షలతో పరుశురాంను హత్య చేసిన బైరెడ్డి అనేవ్యక్తి. ఆ తర్వాత --హత్య తానే చేశానంటూ సోషల్ మీడియాలో బైరెడ్డి పోస్ట్ పెట్టడం కలకలం రేపింది. -- రక్తంతో కూడిన గొడ్డలి వీడియోను బైరెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో పెట్డడంతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బైరెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన మృతుడు పర్శరాం వేములవాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ వద్ద గత కొంతకాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి బైరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం రాత్రి మద్యం మత్తులో కొనాయిపల్లికి చెందిన బైరెడ్డి ఇంటికొచ్చి నమ్మించి బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నాక ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం బైరెడ్డి పరుశరాంను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. బైరెడ్డి గతంలో నాన్నకు స్నేహితుడేనని మృతుని కుమారుడు తెలిపారు. ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి నమ్మించి హత్య చేశాడని చెప్పారు.
హంతకుడి వీడియో కలకలం…
పర్శరాంను హత్య చేశాక బైరెడ్డి రక్తం తో కూడిన గొడ్డలిని చూపిస్తు వీడియో విడుదల చేయడం కలకలం సృష్టించింది. చూసిర్రా...రక్తం మరకలు అంటూ గొడ్డలి చూపారు. బైరెడ్డి అంటే ఏంటో ఒక్కొక్కడికి చూపిస్తానని వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైరెడ్డి హల్ చల్ చేస్తు వీడియో విడుదల చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
పరశురాం అత్యంత దారుణ హత్యకు గురికావడం, హంతకుడు గొడ్డలి ప్రదర్శిస్తూ వీడియో విడుదల చేయడం పట్ల పోలీసులు సీరియస్ గా స్పందించారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని వేములవాడ ఆసుపత్రికి తరలించి హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైరెడ్డి పై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా బైరెడ్డితో పాటు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..