/rtv/media/media_files/2025/10/27/sexual-assault-on-woman-by-bihar-workers-2025-10-27-13-07-31.jpg)
Sexual assault on woman by Bihar workers
CRIME : మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా రాక్షసులుగా మారుతున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లులో పనిచేయడానికి వచ్చిన బీహార్ కార్మికులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫర్ది పేట గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ పత్తి ఏరడానికి చేనులోకి నడుచుకుంటూ వెళుతున్న మహిళను స్థానికంగా రైస్ మిల్లులో పనిచేసే కార్మికులు అటాకాయించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆదివారం మధ్యాహ్నం సదరు మహిళ పత్తి చేనులో పత్తి ఏరడానికి వెళుతున్న సమయంలో మద్యం సేవించి ఉన్న స్థానిక రైస్ మిల్‌లో పనిచేసే కార్మికులు రైస్ మిల్లుకు సమీపంలోనే కాపుకాసి ఆమెను అటకాయించారు. అనంతరం రోడ్డు పక్క పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న దళిత సంఘాలు సోమవారం ఉదయం రైస్ మిల్లు వద్ద ఆందోళనకు దిగాయి. అత్యాచారానికి ఒడిగట్టిన రైస్ మిల్ కార్మికులను అప్పగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో కూడా బీహార్‌కు చెందిన రైస్ మిల్ కార్మికులు గ్రామంలో అమానవీయ ఘటనలకు పాల్పడ్డారని ఆందోళనకారులు గుర్తు చేశారు. ఘటనకు రైసుమిల్ యజమాని బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో రైస్ మిల్లు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు.
Also Read: తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
Follow Us