/rtv/media/media_files/2025/12/30/fotojet-49-2025-12-30-09-22-36.jpg)
Bhupalpalli hostel warden harassment
Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్‌లో వార్డెన్ భవాని ఒక విద్యార్థినిని విచక్షణారహితంగా చితకబాదారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్సీ గర్ల్ హాస్టల్ విద్యార్థినిని వార్డెన్ చితక బాదిన ఘటన వీడియో వైరల్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్ హాస్టల్ లో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని బూతులు తిడుతూ..కర్ర, చేతులతో ఇష్టారీతిన విచక్షణారహితంగా చావబాదింది. ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియో తీశారు. గత నెల 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్ లో విద్యార్థినులకు మత బోధనలు చేసిన ఘటన వివాదస్పదమైంది. విద్యార్థినిని చితకబాదిన ఘటన వీడియో వైరల్ కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేందుకు మా పిల్లలను పంపిస్తే..మత బోధనలు..చితకబాదుడు ఘటనల బారిన పడటంపై వారు ఆందోళన చెందుతున్నారు. కాగా విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..హాస్టల్ ముందు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
తరుచూ వివాదాల్లో చిక్కుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మరోసారి వివాదాలకు నిలయమైంది. విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన వార్డెన్ ఒక విద్యార్థినిపై అమానుషంగా దాడికి పాల్పడింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని వార్డెన్ భవాని కర్రతో, చేతులతో ఇష్టారీతిన చితకబాదిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత నెల 24వ తేదీన హాస్టల్‌లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానికి, సదరు విద్యార్థినికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్, విద్యార్థిని అని కూడా చూడకుండా కర్ర తీసుకుని దాడికి తెగబడ్డారు. తోటి విద్యార్థినులు అడ్డుకుంటున్నా వినకుండా.. బూతులు తిడుతూ కనికరం లేకుండా కొట్టారు. ఈ దారుణాన్ని గమనించిన తోటి విద్యార్థినులు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే.. వార్డెన్ భయంతో ఈ విషయం బయటకు రాకుండా దాదాపు నెల రోజులుగా గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా ఈ హాస్టల్ గతంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. రెండు నెలల క్రితం ఇదే హాస్టల్‌లో విద్యార్థినులకు కొన్ని వర్గాలవారు మత బోధనలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ వార్త రాష్ట్రస్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువక ముందే, ఇప్పుడు ఏకంగా విద్యార్థినిపై ఏకంగా దాడి జరగడం సంచలనంగా మారింది. వరుసగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా విద్యార్థినిపై దాడి చేసిన వీడియో బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఇతర దళిత సంఘాలు హాస్టల్ ముందు భారీ నిరసన చేపట్టాయి. వార్డెన్ భవానిని వెంటనే విధుల నుంచి తొలగించడమే కాకుండా, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిల్లాలోని హాస్టళ్లలో ఉన్న పరిస్థితులను సమీక్షించాలని కోరుతున్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని సంఘాల నేతలు స్పష్టం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Follow Us