Telangana Assembly : రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

లంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

New Update
Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 19 లేదా 20న వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి 3 లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: రన్యా రావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్‌ కీలక ఆదేశం  


గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించనున్నారో ఖరారు చేయనున్నారు. బడ్జెట్​ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 13న గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయసభల్లో వేరు వేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపు తీర్మానం చేస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్​, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మానం చేయనున్నారు.

Also Read:  Boat Accident: పడవ బోల్తా పడి 25 మంది మృతి..వారిలో ఫుట్‌బాల్ ఆటగాళ్లు  కూడా!
 
ఈనెల 19న బడ్ఝెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరు వరకు సభ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్​తో పాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్​లు 42 శాతం అమలుచేస్తూ తీర్మానమే ప్రధానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ హాజరుకానున్నారు. తాను సమావేశాలకు వస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతులు, నిరుద్యోగుల సమస్యలు, కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటిలు ఇలా పలు ప్రధానమైన అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్​ ప్రసాద్​కుమార్​, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అటంకాలు కలగకుండా సమావేశాలు జరిగే విధంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Also Read: సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు