/rtv/media/media_files/2025/06/16/8AgnEl3CbBxVr75mXkzy.jpg)
Another shooting spree in America
America : అమెరికాలో తుపాకి సంస్కృతి రాజ్కమేలుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈ కాల్పుల్లో అమాయకులు బలవుతున్నారు. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికాలో కలకలం రేగింది. ఉటాలోని సెంటినియర్ పార్క్‌లో నిర్వహించిన వెస్ట్‌ఫెస్ట్ కార్నివాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. చనిపోయినవారిలో 8 నెలల శిశువు, ఓ యువకుడు, మరో మహిళ ఉన్నారని తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: 'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!
అయితే పార్కులో రెండు వేర్వేరు గుంపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అది ఘర్షణకు దారి తీసింది. దీంతో 16 ఏళ్ల యువకుడు తన వద్ద ఉన్న తుపాకీతో ప్రత్యర్థి గుంపుపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మరణించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయం నెలకొంది. అధికారులు భద్రతను పెంచారు. కాగా యువకుడి మృతితో హింసాత్మక ఘటనలు చెలరేగే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!
Follow Us