తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు

పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు.స్వామి వారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీపెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు.

New Update
annamayya

annamayya

Tirumala: పవిత్రమైన తిరుమల తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీని పెట్టి పరారయ్యారు.

Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!

 కాగా ఉదయం స్వామి వారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీపెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయనున్నారు. కాగా ఈ సమాచారం అందుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. 

Also Read: ఆర్జీ కార్ హత్యాచార కేసు ఫోరెన్సిక్ రిపోర్టు...ఆ సమయంలో పెనుగులాటే జరగలేదట!

శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడిని కించ పరిచేలా వ్యవహరించిన దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు.క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు.

Also Read: Dead Body Parcel Case: డెడ్‌బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు అరెస్ట్!

కాగా రేపు క్రిస్మస్ పండుగ కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు అప్రమత్తమై.. ఇటువంటి అపచారం చేసిన నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Also Read: Donald Trump: ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత్‌ -అమెరికన్‌ వ్యాపారవేత్త!

 టీటీడీ మాజీ చైర్మన్ భూమనప్రెస్ మీట్.

అన్నమయ్య విగ్రహానికి జరిగిన అపచారాన్ని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారంటూ భూమన ప్రశ్నించారు. 32 వేల సంకీర్తనలతో వెంకటేశ్వర స్వామి మనసు గెలుచుకున్న అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగితే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మండిపడ్డారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్య పై చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లు బహిరంగ క్షమాపణ చెప్పాలని భూమాన డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా  ఏనాడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. వైసీపీ స్వామి వారి పవిత్రతను కాపాడిందే తప్ప దిగజార్చలేదని భూమన చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు