BIG BREAKING: 'శ్రీతేజ్ కోసం విదేశాల నుంచి వైద్యులు'

అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ప్రకటించారు. హాస్పిటల్ ఖర్చులన్నీ ఇప్పటివరకూ ప్రభుత్వమే భరించిందని తెలిపారు. అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు.

New Update
Srithej Revanth reddy

Revanth reddy, Sri tej (File Photo)

అల్లు అర్జున్ శ్రీతేజ చికిత్స తామే చేయిస్తున్నామని అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు శ్రీతేజ హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించిందన్నారు. భవిష్యత్ లో కూడా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. రూ.25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారన్నారు. కానీ, రూ.10 లక్షల విలువైన డీడీలు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేయని వాటికి చేసినట్లు ప్రచారం చేసుకోవడం అల్లు అర్జున్ కే చెల్లుతుందన్నారు.
ఇది కూడా చదవండి: 'నీ కంటే సమంత, మంచులక్ష్మి నయం..అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు'

*ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం @అరణ్య భవన్* *తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ప్రెస్ మీట్* సంధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆమె మరణించడం బాధాకరం... హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ తల్లిని కోల్పోయాడు ఆ భాద ఎన్ని కోట్లు ఇచ్చిన పూడ్చలేనిది అల్లు అర్జున్ శ్రీతేజ చికిత్స తామే చేయిస్తున్నామని అబద్ధాలు మాట్లాడారు ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది భవిష్యత్తు లో ఏమైనా ఉన్న ప్రభుత్వమే చూసుకుంటుంది... అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యం అందిస్తాము 25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారు... కానీ 10 లక్షలు మాత్రమే డీడీలు ఇచ్చారు ఈ విషయంలో అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి చేయని వాటికి చేసినట్లు ప్రచారం చేసుకోవడం అల్లు అర్జున్ కే చెల్లుతుంది ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అక్కడ చనిపోయిన కుటుంబం వారికి కనిపించడం లేదు వైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపు లాగా ఉంది ఎన్నికల సమయంలో అవసరమా అయ్యే వైశ్యులు ఇలాంటి సమయంలో కనిపించకపోవడం బాధాకరం అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన బిజెపి , బిఆర్ఎస్ పార్టీలకు వైశ్యులు తగిన గుణపాఠం చెప్పాలి ఆయా పార్టీలలో ఉన్న వైశ్యులు ఒకసారి పునరాలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు కానీ అల్లు అర్జున్ పై ఎలాంటి పగ లేదు అన్యాయం జరిగినా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి.

Posted by Kalva Sujatha Guptha on Monday, December 23, 2024

వైశ్యులు అంటే చిన్న చూపా?

ప్రతిపక్షాలు అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అక్కడ చనిపోయిన కుటుంబం వారికి కనిపించడం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ అని తెలిపారు. వైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపు లాగా ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అవసరమయ్యే వైశ్యులు ఇలాంటి సమయంలో కనిపించకపోవడం బాధాకరమన్నారు. అల్లు అర్జున్ కు మద్దతు ఇచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వైశ్యులు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. 
ఇది కూడా చదవండి: సంధ్య థియేటర్‌ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్‌ భారీ సాయం

ఆయా పార్టీల్లో ఉన్న వైశ్యులు ఈ విషయంపై ఒకసారి పునరాలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పై ఎలాంటి పగ లేదని స్పష్టం చేశారు. అన్యాయం జరిగిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని కాల్వ సుజాత డిమాండ్ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు