Aghori - Sri Varshini: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో

తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.

New Update

అఘోరీ పై వర్షిణీ పేరెంట్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ బిడ్డపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణం జరిపి తనవైపుకు తిప్పుకుందని వారు ఆరోపించారు. మరోవైపు అఘోరీ డబ్బులు ఆశచూపిందని వర్షిణీ అన్న శ్రీవిష్ణు ఇటీవల ఓ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా అఘోరీ బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నాయని.. వారు తెలిపారు. వీటన్నింటిపై అఘోరీ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తాను ఈ ఆరోపణలపై క్లారిటీ ఇస్తానని.. తన బ్యాంక్ స్టేట్‌మెంట్ సైతం చూపిస్తానంటూ అఘోరీ ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీ సంచలన వీడియో

అఘోరీ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం.. ‘‘నేను కాశీలో ఉన్నాను. నాపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మా సాధన గురించి మీకు ఏం తెలుసని విమర్శలు చేస్తున్నారు. ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.  ఒక సాధకుడ్ని, అఘోరీని హింసిస్తే ఊరుకునేది లేదు. ఎవరెవరు నాపై విమర్శలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాను. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కాశీ మీద ఒట్టేసి చెబుతున్నా ఎవ్వరినీ వదిలేదు లేదు. నాది ధర్మపోరాటం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతమంది అడ్డుకున్నా.. నా పోరాటాన్ని నేను కొనసాగిస్తాను. ఇకనుంచి నా ఉగ్రరూపం చూస్తారు. ఎవ్వరినీ వదిలి పెట్టను. అందరి అంతూ చూస్తాను. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను ప్రస్తుతం కాశీలో ఉన్నాను. త్వరలోనే తెలంగాణ, ఆంధ్రాకు వస్తాను. ’’ అని తెలిపింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(aghori | lady aghori | aghori sri varshini | b tech aghori sri varshini | latest-telugu-news | telugu-news | aghori video)

Advertisment
తాజా కథనాలు