Telangana: దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయి రేవంత్‌.. అఘోరీ ఛాలెంజ్‌!

సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులో అఘోరీ మాత హల్‌చల్‌ చేసింది. నేను అరెస్ట్‌ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఛాలెంజ్‌ విసిరింది

New Update

తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఒంటిపై దుస్తులు లేకుండా.. విభూది రాసుకుని సంచరిస్తున్న ఆ అఘోరిని చూసి అంతా షాక్ అయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆమె మళ్లీ అక్కడ ప్రత్యక్ష్యమయ్యారు. అక్కడ ఒంటికాలిపై నిలబడి పూజలు చేశారు. అప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు.

Also Read:   నాగార్జునకు తప్పిన ప్రమాదం!

వరుసగా ఇంటర్వ్యూలు..

అనంతరం మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Also Read:  దేశంలోని CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు

కీసర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఆమె అఘోరాగా మారారా? లేక జనాలను మోసం చేస్తోందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Also Read: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్‌..పరీక్షా విధానంలో మార్పులు!

ఈ క్రమంలో సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీసులో అఘోరీ మాత హల్‌చల్‌ చేసింది. నేను అరెస్ట్‌ కాలేదు. అరెస్ట్‌ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకో అంటూ ఆమె ఛాలెంజ్‌ విసిరింది. సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఆర్పిస్తా అని తెలిపింది. ముఖ్యమైన పని మీద బద్రినాథ్‌ లోని గురువు దగ్గరకు వెళ్తున్నట్లు వివరించింది. 

Also Read: మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?

తిరిగి వచ్చిన తరువాత తెలంగాణలో బీభత్సం సృష్టిస్తా అని పేర్కొంది. అరెస్ట్ కాక ముందే అరెస్ట్ అయ్యానని..తానో ఫేక్ అఘోరా అని పలు యూట్యూబ్ ఛానళ్లు.. దుష్రచారం చేస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

#hyderabad #revanth-reddy #aghori
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe