Nagarjuna: నాగార్జునకు తప్పిన ప్రమాదం!

హీరో నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కొరకు విమానంలో అనంతపురం వెళ్తున్న నాగార్జున వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కాగా ఆయన వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

New Update
Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట

Nagarjuna: హీరో నాగార్జునకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కోసం అనంతపురం బయలుదేరారు నాగార్జున. పుట్టపర్తి ఎయిర్​పోర్టు నుంచి వస్తున్న సమయంలో వరద ప్రాంతంలో నాగార్జున చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి క్షేమంగా రూట్ మళ్లించడంతో నాగార్జునకు ప్రమాదం తప్పినట్లయింది. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీ షోని హోస్ట్ చేస్తున్న నాగార్జున.. తన కుటుంబంతో కలిసి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!

నీటమునిగిన అనంతపురం....

అనంతపురంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శివారులోని కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరింది. ఆటోలు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో  పండమేరుకు వరద ఉదృతి పెరిగింది. అలాగే చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బహుదానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. తొడతర సమీపంలో బహుదానదిపై వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఐదు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా రాకపోకలు సాగించడానికి వంతెనకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు

ఇది కూడా చదవండి :  Bomb Threats: దేశంలోని CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఇది కూడా చదవండి :  Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు