Hydra మళ్ళీ పని మొదలు పెట్టిన హైడ్రా బుల్డోజర్లు.ఈ సారి ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి తన పనులు మొదలు పెట్టింది.అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. దీంతో ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను తొలగిస్తుంది.

New Update
HYDRA 3

Hyderabad : హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి తన పనులు మొదలు పెట్టింది. చెరువుల ఎఫ్​టీఎల్​లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలపైనే కాకుండా వాటి శిథిలాల తొలగింపుపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది.. తొలుత నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువులో కూల్చివేసిన భవనాల వ్యర్థాల తొలగింపును చేపట్టిన హైడ్రా, పూర్తి స్థాయిలో అక్కడి శిథిలాలను తొలగించి ఆ చెరువునకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది.

Also Read:  తండ్రైన ఇండియన్ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇన్స్టాలో పోస్ట్!

అందులో భాగంగా అక్కడి వ్యర్థాల్లో భవన నిర్మాణ యజమానులు వారికి అవసరమైన సామాగ్రిని తీసుకుపోగా, మిగిలిన శిథిలాలను జేసీబీల సహాయంతో లారీల్లో తరలిస్తోంది. ఎర్రకుంట ఎఫ్​టీఎల్​లో అక్రమంగా 5 అంతస్తుల్లో 3 భవనాలను నిర్మించారు. వాటిని గుర్తించిన హైడ్రా ఆగస్టు 14న కూల్చివేసిన సంగతి తెలిసిందే. వ్యర్థాలను తొలగించని నిర్మాణదారుడికి నోటీసులిచ్చి ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న వ్యర్థాలను తొలగించే పనుల్లో నిమగ్నమైంది.

Also Read:  యువకుడిని బలి తీసుకున్న కుక్క.. హైదరాబాద్‌లో విషాద ఘటన

సహజ సిద్ధంగా ఏర్పడ్డ చెరువులను రాబోయే తరానికి, అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దాలి. ఆక్రమణలకు గురైన ల్యాండ్​ను స్వాధీనం చేసుకుని సరస్సుల్లా మార్చాలి. ఈ లక్ష్యాలతో నూతన తరహాలో జలవనరులకు పునరుజ్జీవం కల్పించేందుకు హైడ్రా కసరత్తులు మొదలుపెట్టింది. ముందుగా 'చెరువులు ఎందుకు?' అనే చిన్న ప్రశ్నతో చర్చను ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారులతో పాటు  నీటి పారుదల శాఖ, వాలంటరీ ఆర్గనైజేషన్స్ పరిశోధన, నిపుణులతో కమిషనర్‌ ఏ.వి.రంగనాథ్‌ విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు.

Also Read:  బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!

అప్పట్లో చెరువులే...

50 ఏళ్ల క్రితం నగరంలోని అనేక చెరువులు వ్యవసాయానికిఉపయోగపడేవి. సిటీగా రూపాంతరం చెంది పొలాలన్నీ కాలనీలయ్యాయి. హయత్‌నగర్‌, గౌరెల్లి, ప్రతాపసింగారం, తూంకుంట, నార్సింగి వంటి పలు చోట్ల పంట పొలాలు కనిపిస్తున్నప్పటికీ అవి బోరు బావులపై ఆధారపడినవి. నగర జనాభా రోజురోజుకూ పెరగడంతో చెరువులు మురికి  కూపాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో  మురుగునీటిని నిల్వ చేయడం అవసరమా? అనే అంశంపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.

Also Read:   తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు